హరీష్ రావు వ్యాఖ్యల్లో తప్పేముంది.?

CPI Ramakrishna Reacts On Harish Rao Comments. తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల్లో తప్పేముందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్ర‌శ్నించారు.

By Medi Samrat  Published on  1 Oct 2022 5:02 PM IST
హరీష్ రావు వ్యాఖ్యల్లో తప్పేముంది.?

తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల్లో తప్పేముందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్ర‌శ్నించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా? అని నిల‌దీశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులతో ఉక్కుపాదం మోపలేదా? అని నిప్పులు చెరిగారు. పిఆర్సి, సిపిఎస్ అంశాలలో ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లిందా లేదా? అని ప్ర‌శ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్ స్టేషనులకు పిలిపించి వేధించటం, గృహనిర్బంధాలు, వారి కుటుంబ సభ్యులను పలు రకాల వేధింపులకు గురి చేయటం నిజం కాదా? అడిగారు. ఆఖరికి టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టారా లేదా? ప్ర‌శ్నించారు. హరీష్ రావు ఉన్నది చెబితే.. వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకు?.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబించడాన్ని ఖండిస్తున్నామ‌ని రామకృష్ణ అన్నారు.


Next Story