కోసినా డబ్బులు లేవన్న సీఎం కొత్త పథకాలు ఎందుకు పెడుతున్నారు.?

ఆపరేషన్ కగార్ పేరుతో ఎంత మంది మావోయిస్టులను చంపారు, చంపుతున్నారు.. కేంద్రం పాలసీ ఏంటో స్పష్టంగా చెప్పాలని.. ఆపరేషన్ కగార్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు

By Medi Samrat
Published on : 20 May 2025 5:41 PM IST

కోసినా డబ్బులు లేవన్న సీఎం కొత్త పథకాలు ఎందుకు పెడుతున్నారు.?

ఆపరేషన్ కగార్ పేరుతో ఎంత మంది మావోయిస్టులను చంపారు, చంపుతున్నారు.. కేంద్రం పాలసీ ఏంటో స్పష్టంగా చెప్పాలని.. ఆపరేషన్ కగార్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలతో రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ కగార్‌లో పాల్గొన్నారు.. ఆపరేషన్ కగార్ పై రాష్ట్ర ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలన్నారు.

కేంద్రానికి మావోయిస్టులు మీద ఉన్న కోపం, కసి ఉగ్రవాదుల మీద లేదన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని దేశమంతా గగ్గోలు పెడుతుంది.. ఉగ్రవాదులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులైన మావోయిస్టులతో ఎందుకు జరపడం లేదన్నారు. ఉగ్రవాదుల కంటే మావోయిస్టులు అత్యంత ప్రమాదకరమా కేంద్రం చెప్పాలన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుంది.. కొత్త సంక్షేమ పథకాల వల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది.. పాత సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటి..? అని ప్ర‌శ్నించారు. పాత సంక్షేమ పథకాలు అరకొర అమలు చేయడం వల్ల ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కోసినా డబ్బులు లేవన్న ముఖ్యమంత్రి కొత్త పథకాలు ఎందుకు పెడుతున్నారు.. కొత్త పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారని ప్ర‌శ్నించారు.

గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈ ప్రభుత్వం ఎట్లా బయట పడుతుంది.. ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. రేషన్ కార్డులను త్వరితగతిన ఇవ్వాలి.. ఎల్ఆర్ఎస్ ను పూర్తి చేయాలన్నారు. ఆదాయ మార్గాలను అన్వేషించకుండా.. ఎవ్వరూ చెప్పిన వినకపోతే ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కు తాము వ్యతిరేకం.. వాళ్లు అధికారంలోకి రావాలని కోరుకోమన్నారు. అప్పుల సుడిగుండాన్ని సృష్టించిందే బీఆర్ఎస్.. కేంద్రం రాష్ట్రాన్ని బిచ్చమెత్తూకునేలా చేసిందన్నారు. కేంద్రం తండ్రి పాత్ర పోషించాలన్నారు.. అమరావతికి గతంలో పిడికెడు మట్టి, చెంబు నీళ్ళు ఇచ్చి మోసం చేసింది.. ఇప్పుడు ఏదో కొంత సహాయం చేస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు.

Next Story