అంబేద్క‌ర్ గుండె పైన దాడి జరిగినట్టే : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

పార్లమెంట్ మీద దాడి జరగడం అంటే అంబేద్క‌ర్ గుండె పైన దాడి జరిగినట్టేన‌ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు

By Medi Samrat  Published on  22 Dec 2023 2:28 PM IST
అంబేద్క‌ర్ గుండె పైన దాడి జరిగినట్టే : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

పార్లమెంట్ మీద దాడి జరగడం అంటే అంబేద్క‌ర్ గుండె పైన దాడి జరిగినట్టేన‌ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ధర్నా చౌక్ లో జ‌రుగుతున్న నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. దాడికి కారణం ఎవ‌రు అని ప్రధాని ,హోంమంత్రిని అడిగితే హిట్లర్‌, ముస్సోలిని లా ప్రవర్తించారు.. ఎంపీలను సస్పెన్షన్ చేశారని మండిప‌డ్డారు. హిట్లర్, ముస్సోలీని లాగా మీరు జైలుకు వెళ్ళక తప్పదని జోష్యం చెప్పారు. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో ప్రజా తీర్పుకు విరుద్ధంగా ఫలితం వచ్చిందన్నారు. ఆగంతకులకు పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీ అని.. ఆయన ను ఏమైనా సస్పెండ్ చేసారా అని ప్ర‌శ్నించారు.

రాహుల్ గాంధీ ఏం అన్నారని సభ్యత్వం రద్దు చేశారని ప్ర‌శ్నించారు. తృణముల్ ఎంపీ ప్రశ్నిస్తే సభ్యత్వం రద్దు చేస్తారా అని మండిప‌డ్డారు. నరేంద్ర మోదీ తప్పులను ఎండగట్టడం కోసం కలిసి నడుద్దాం అని పిలుపునిచ్చారు. సస్పెన్షన్ రద్దు చేయాలి.. ఆగంతకుల దాడి మీద ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని మీరే ఈ కుట్ర చేసారా అనే సందేహం వ్య‌క్తం చేశారు. ఈ విష‌య‌మై నిజానిజాలు తేలాలని అన్నారు.

Next Story