తెలంగాణలో బూస్టర్‌ డోసు పంపిణీ.. ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు

Covid booster dose in Telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు

By అంజి  Published on  10 Jan 2022 6:22 AM GMT
తెలంగాణలో బూస్టర్‌ డోసు పంపిణీ.. ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. చార్మినార్‌ యునానీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫస్ట్‌ బూస్టర్‌ డోసును స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్‌ అంజద్‌ ఖాన్‌ తీసుకున్నారు. రాష్ట్రంలోని హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న సీనియర్‌ సిటిజన్లకి బూస్టర్‌ డోసు వేస్తున్నారు. ఇందుకు ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ కోవిడ్ టీకా కేంద్రాలలో సంబంధిత ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం.. రాబోయే నెలల్లో మొత్తం 41.60 లక్షల మంది సీనియర్ సిటిజన్లు, 6.34 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ లేదా ముందుజాగ్రత్త కోవిడ్ వ్యాక్సిన్ డోస్ ఇవ్వనున్నారు. సీనియర్ సిటిజన్లకు వారి వైద్యులతో సంప్రందించిన తర్వాత వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.

"అర్హత ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, జీహెచ్‌ఎంసీ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ఫ్రంట్‌లైన్ వర్కర్లు బూస్టర్ డోస్‌లను పొందేలా చూడాలని నేను కోరుతున్నాను. సీనియర్ సిటిజన్లందరికీ ముందుజాగ్రత్తగా డోస్ ఇవ్వడానికి అనుమతించాలని మేము కేంద్రాన్ని కోరాము. "అని ఆరోగ్య మంత్రి టి హరీష్ రావు ఆదివారం అన్నారు. "అర్హత ఉన్న లబ్ధిదారులందరూ వారి రెండవ డోస్ సకాలంలో తీసుకుంటే, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు జనవరి 2022 నుండి ముందుజాగ్రత్త డోస్ పొందడానికి అర్హులవుతారు. అయితే ఏప్రిల్, 2021 నాటికి రెండవ డోస్‌ తీసుకున్న సీనియర్ సిటిజన్‌లు దీనికి అర్హులు." అని అధికారులు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సిహెచ్‌సిలు), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు (యుపిహెచ్‌సిలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు), తృతీయ స్థాయి సహా అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో సీనియర్ సిటిజన్‌లు, హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉంటాయి.

Next Story