తెలంగాణలో అప్పటి వరకు కరోనా ఆంక్షలు.. ఉత్తర్వులు జారీ
Covid-19 restrictions in telangana. తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కొవిడ్ నియంత్రణ చర్యలకు
By అంజి Published on 25 Dec 2021 1:11 PM GMTతెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కొవిడ్ నియంత్రణ చర్యలకు సిద్ధమైంది. ఓమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు డిజాస్టర్ మేనెజ్‌మెంట్ యాక్ట్ కింద ఆంక్షలు అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించారు. అలాగే కొన్ని నిబంధనలతో జనం గుంపు గూడే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
భౌతిక దూరాన్ని తప్పనిసరి పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం తెలిపింది. ఆయా కార్యక్రమాల ప్రధాన ద్వారాల వద్ద థర్మల్ స్కానర్లును ఏర్పాటు చేయాలని, వాటితో ఆ కార్యక్రమానికి వచ్చే వ్యక్తులు ఉష్ణోగ్రతలను పరిశీలించాలని తెలిపింది. ఇక ఇటీవలే మాస్కు ధరించడంపై జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. తాజా ఉత్తర్వులను జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలనలి సర్కార్ ఆదేశించింది.
తాజా ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జారీ చేశారు. రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ, రాజకీయ , సంప్రదాయ కార్యక్రమాల్లో కనీస కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని పలువురు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో జరిగి న్యూ ఇయర్ వేడుకల్లో జనం భారీగా గుమిగూడే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో స్పందించిన రాష్ట్ర హైకోర్టు.. వేడుకలను నియంత్రించాలని ఆదేశాలిచ్చింది.