సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చింది అక్కడి నుండే.. తేల్చేసిన పోలీసులు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన ఓ వ్యక్తికి సంబంధించిన ఆచూకీ కర్ణాటకలో లభించింది.

By Medi Samrat  Published on  5 Nov 2024 7:58 PM IST
సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చింది అక్కడి నుండే.. తేల్చేసిన పోలీసులు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన ఓ వ్యక్తికి సంబంధించిన ఆచూకీ కర్ణాటకలో లభించింది. ట్రాఫిక్ పోలీసులకు వచ్చిన మెసేజ్ మూలం కర్ణాటకకు చెందినదని ముంబై పోలీసు అధికారులు గుర్తించారు. వెంటనే నిందితుడిని పట్టుకోవడానికి పోలీసుల బృందాన్ని పంపించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నుండి డబ్బు డిమాండ్ చేస్తూ వేర్వేరు వ్యక్తులు బెదిరించడం 3 వారాల వ్యవధిలో ఇది మూడవది.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానంటూ బెదిరింపు సందేశాన్ని పంపాడు. ఈ మెసేజీ మంగళవారం తెల్లవారుజామున వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని హెల్ప్‌లైన్ నంబర్‌కు ఈ మెసేజీ వచ్చింది. దీంతో వెంటనే వర్లీ పోలీసు అధికారులకు సమాచారం అందించారు. సల్మాన్ ఖాన్ బతికే ఉండాలంటే రెండే రెండు ఆప్షన్లు ఇస్తున్నామన్నాడు. ఒకటి దేవాలయంలోకి వచ్చి క్షమాపణలు చెప్పడం. లేదా.. 5 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు సల్మాన్ ఖాన్ ను ఎప్పుడైనా చంపేస్తారంటూ తమకు మెసేజీ వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

Next Story