ఎమ్మెల్యేల అనర్హత కేసు..తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
తెలంగాణలో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.
By - Knakam Karthik |
ఎమ్మెల్యేల అనర్హత కేసు..తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
తెలంగాణలో ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు జూలై 31న స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చింది. అయితే గడువు ముగిసినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, ఇప్పుడు సుప్రీంకోర్టులో కాంటెంప్ట్ ( కోర్టు దిక్కరణ) పిటిషన్ వేయబడింది.
సోమవారం కోర్టులో ఈ విషయాన్ని కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు ప్రస్తావించారు. “స్పీకర్ గారు ఈ కేసును ఒక్కసారైనా టచ్ చేయలేదు. ఎలాంటి విచారణ కూడా జరగలేదు. ఎమ్మెల్యేలు ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్నారు.” అని కోర్టుకు చెప్పారు.
ఈ పిటీషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి స్పందిస్తూ, వచ్చే సోమవారం ఈ పిటిషన్ విచారణకు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా, అడ్వకేట్ సూచిస్తూ—ఈ నెలాఖరులో చీఫ్ జస్టిస్ రిటైర్ అవుతుండడంతో విచారణను ఆలస్యం చేస్తున్నారనే విమర్శకు, CJI ఇలా స్పందించారు: “నవంబర్ 24 తర్వాత కూడా సుప్రీంకోర్టు మూసేయబడదు.” అని వ్యాఖ్యానించారు.
ఈ కేసు ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పడి కౌశిక్ రెడ్డి, కె.ఓ. వివేకానంద్ పెట్టిన పిటిషన్లకు సంబంధించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన టైమ్ లిమిట్ ముగిసినా, డిస్క్వాలిఫికేషన్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలపై చర్య నిలిచిపోయింది.