డిసెంబర్ 9న పెద్ద ఎత్తున కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపు

Congress will take up large-scale programs on December 9. డిసెంబర్ 9కి తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  3 Dec 2022 8:00 PM IST
డిసెంబర్ 9న పెద్ద ఎత్తున కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపు

డిసెంబర్ 9కి తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోనియాగాంధీ జన్మదినంతో పాటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రకటించిన రోజు అని ఆయ‌న అన్నారు. డిసెంబర్ 9 కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం అని పేర్కొన్నారు. ఆ రోజు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని.. సభ్యత్వ కార్డుల పంపిణీకి కార్యాచరణ చేపట్టాలని నేత‌ల‌కు దిశానిర్ధేశం చేశారు.

డిసెంబర్ 9న రక్తదాన శిబిరాన్ని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లో ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు. డివిజన్ ల వారీగా సమీక్షించి డిసెంబర్ 6 లోపు దాతల పేర్లు నమోదు చేసుకోవాలని.. రక్తదానం చేసినవారికి సర్టిఫికెట్, మెమెంటో అందజేసి గౌరవిద్దాం అని పేర్కొన్నారు. సోనియా జన్మదినం సందర్బంగా వెయ్యి మంది పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు 2 లక్షల బీమా చెక్కులను అందజేయనున్న‌ట్లు పేర్కొన్నారు. పని విభజన చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలని.. కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నేతలను ఆహ్వానించాలని చెప్పారు.


Next Story