ఇందిరా గాంధీ ఇచ్చిన భూములు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దొరల చేతులకు పోయిందని.. చెరువులు కూడా కబ్జాకు గురైనవని మాజీ ఎంపీ వీ హనుమంత రావు ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబర్ పేట్ బతుకమ్మ కుంట చెరువును బీఆర్ఎస్ లీడర్ సుధాకర్ రెడ్డి నీరు-మీరు కార్యక్రమంలో కబ్జా చేసిండని.. ఆక్రమించినట్లు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ హాయంలో మహ్మద్ ఆజం అనే వ్యక్తి బతుకమ్మ కుంట చెరువును ప్రభుత్వానికి అప్పజెప్పాడు. కవిత బతుకమ్మ నిర్వహించింది కానీ బతుకమ్మ కుంటను కాపాడలేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను కాపాడాలని.. కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బతుకమ్మ కుంటను పరిశీలించాలి.. ఆక్రమించిన సుధాకర్ రెడ్డి పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాకు గురైన 20 చెరువులలో బతుకమ్మ కుంట మొదటిది అన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే నేను ఉరుకోను అన్నారు. అడ్వకేట్ జనరల్ ను కలిసి పూర్తి ఆధారాలు ఇస్తానన్నారు. వచ్చే సంవత్సరం బతుకమ్మ కుంటను ప్రభుత్వం చెరువు చేయాలి.. అక్కడే బతుకమ్మ ఆడాలన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు కండ్లు తెరవాలి.. లేదంటే మహిళలు చీపురుతో కొడతారని హెచ్చరించారు.