జవహర్ లాల్ ప్రధాని అయినప్పుడు.. దేశంలో ఓక సూది తయారు కంపెనీ కూడా లేదని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. నెహ్రూ ప్రధాన మంత్రి అయిన తర్వాతే దేశంలో వస్తువుల తయారి మొదలైందని ఆయన అన్నారు. జాతీయ జెండా విషయం లో బీజేపీ నేతల వాఖ్యలను దేశ ప్రజలు అసహ్యించుకుంటుంన్నారని తెలిపారు. జెండా మారుస్తా అనే ధైర్యం బీజేపీ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు.
దేశ స్వాతంత్యం కోసం ఎంతో మంది కాంగ్రెస్ నేతలు ప్రాణ త్యాగాలు చేసారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఓక్కటి నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. జెండా మార్చే హక్కు బీజేపీ కి ఎక్కడిదని ప్రశ్నించిన ఆయన.. భారతదేశం ఎప్పుడు సెక్యులర్ గానే ఉంటుందని.. హిందూ దేశం గా మార్చుస్తామంటే వ్యతిరేకిస్తామన్నారు. నెహ్రూ కు మరో ప్రధాని సాటి రారని.. ప్రశ్నిస్తే .. సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.