బీజేపీకి రాముడు మీద ప్రేమ లేదు : వీహెచ్‌

రాముడు మీద బీజేపీకి ప్రేమ లేదని.. హిందూ ఓట్ల మీద ప్రేమ అని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీ హ‌నుమంత‌రావు అన్నారు.

By Medi Samrat  Published on  17 Jan 2024 2:10 PM IST
బీజేపీకి రాముడు మీద ప్రేమ లేదు : వీహెచ్‌

రాముడు మీద బీజేపీకి ప్రేమ లేదని.. హిందూ ఓట్ల మీద ప్రేమ అని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీ హ‌నుమంత‌రావు అన్నారు. బుధ‌వారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాముడిని కూడా రాజకీయాల్లో లాగి ఓట్లు సంపాదించాలని బీజేపీ చూస్తుందన్నారు. అయోధ్యలో గుడి కట్టారు.. అందరూ పోతారు.. ఇవ్వాలో.. రేపో పోతాము.. దేవుడి మీద అందరికి భక్తి ఉంటది.. నువ్వు పిలిచినప్పుడే రావాలి అన్నట్టు మోదీ వ్యవహారం ఉంద‌ని అన్నారు. నువ్వు పిలిచినప్పుడు ఎందుకు రావాలి.. మాకు పోవాలి అనిపించినప్పుడు పోతాం అని స్ప‌ష్టం చేశారు.

25 కోట్ల పేదలను ధ‌నికులకు చేశా అని మోదీ చెప్పడంతో నవ్వాలా.. ఏడవాలో అర్థం కాలేదన్నారు. మీరు కార్పోరేట్ సెక్టార్‌కే లాభం చేస్తున్నారు.. ఇంతకంటే అబద్ధం ఇంకోటి లేదని దుయ్య‌బ‌ట్టారు. రైతులకు మద్దతు ధర పెంచండి అని అడిగితే ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. నోట్ల రద్దు చేసి.. చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళను మోదీ రోడ్డున వేశాడ‌ని విమ‌ర్శించారు. అంబానీని మించి ఆస్తిపరుడు ఆధానీ అయ్యాడు అంటే మోదీనే కారణం అన్నారు.

Next Story