కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై..బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్?
జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
By - Knakam Karthik |
కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై..బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్?
జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని, ఈ నెల 25న భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇప్పటికే తన ముఖ్య అనుచరులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు, జీవన్ రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రెండేళ్ల క్రితం సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి, పార్టీలో తన ప్రాధాన్యత తగ్గుతోందని, తనను పక్కన పెడుతున్నారని జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 40 ఏళ్లుగా నమ్మకంగా సేవ చేసినా తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగిత్యాలలో భారీ బహిరంగ సభను నిర్వహించి, గులాబీ కండువా కప్పుకోవాలని ఆయన భావిస్తున్నారు. కీలకమైన ఎన్నికల ముందు జిల్లాలో ఒక బలమైన నేత బీఆర్ఎస్‌లో చేరడం ఆ పార్టీకి పెద్ద ఊపునిస్తుండగా, కాంగ్రెస్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు.