నేడు మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో కాంగ్రెస్ సత్యాగ్రహ సభ నిర్వహించనుంది. సభా ప్రాంగణానికి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ప్రాంగణంగా నామకరణం చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర మంచిర్యాలకు చేరిన సందర్భంగా.. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే హాజరవుతున్నారు.
సభలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి ఫేహీం ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. నస్పూర్ పట్టణంలోని కలెక్టరేట్ సమీకృత భవనం సమీపంలో ఈ సత్యాగ్రహ సభ జరగుతుంది. కార్యకర్తలు, ప్రజలు జాతీయ రహదారి విలేజ్ నస్పూర్ టర్నింగ్ వద్ద నుంచి సభాస్థలానికి చేరుకుంటారు. వీఐపీలు కలెక్టరేట్ కు వెళ్లే దారి నుంచి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి తాగునీటి వసతి కల్పించారు.