తొలి భారత గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి మనవడు, మాజీ కాంగ్రెస్ నాయకుడు సీఆర్ కేశవన్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. రెండు నెలల తర్వాత బీజేపీలో చేరారు. "ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ-బీజేపీలో నన్ను చేర్చుకున్నందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. ముఖ్యంగా మన ప్రధాని తమిళనాడులో ఉన్న రోజున" అని సిఆర్ కేశవన్ అన్నారు. సీఆర్ కేశవన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పరివర్తన నాయకత్వం దేశంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంపై మాకు నమ్మకం ఉందని, ఆయన మమ్మల్ని సరైన మార్గంలో తీసుకెళ్తారని ఆయన అన్నారు. సీఆర్ కేశవన్ రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఫిబ్రవరి 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించడం గురించి సిఆర్ కేశవన్ మాట్లాడుతూ.. "నేను గత 22 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్నాను. పార్టీ వైఖరి, విధానం నిర్మాణాత్మకంగా లేవని విమర్శలు చేస్తూ పార్టీని వీడారు.