గంగుల దున్నపోతులా బలిశారంటూ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
ఔట్ డేటెడ్ నేత అన్న గంగుల వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గంగుల దున్నపోతులా బలిసి...
By Srikanth Gundamalla Published on 21 Jun 2023 3:41 PM ISTగంగుల దున్నపోతులా బలిశారంటూ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఔట్ డేటెడ్ నేత అంటూ తనపై చేసిన వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. గంగుల కమలాకర్ దున్నపోతులా బలిసి రైతుల గురించి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ ఒక రాజకీయ వ్యభిచారి అని.. తాను గంగులలా కాదని అన్నారు పొన్నం ప్రభాకర్. ఔట్ డేటెడ్ లీడర్ అని గంగుల చేసిన కామెంట్స్ బి.వినోద్ రావుకి బాగా సూటవుతుందని విమర్శించారు. తన ఓటమి గురించి మాట్లాడుతున్న గంగుల.. సీఎం కూతురు ఓడిపోలేదా..? ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వినోద్ రావు ఎంపీగా ఓడిపోలేదా? అని ప్రశ్నించారు. గంగుల కమలార్‌కు దమ్ముంటే టీడీపీ నుంచి పోటీ చేసి గెలవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. అంతేకాదు.. బీజేపీతో గంగుల కమలాకర్ కలిపోయే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ని గంగుల కలుస్తున్నారని చెప్పారు. బండి సంజయ్, గంగుల ఆలయాల్లో కలుస్తూ.. తన గురించి మాట్లాడుకుని తిడుతున్నారని అన్నారు. ఇదే విషయంపై మహాశక్తి ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తా దమ్ముంటే మీరు రండని గంగుల కమలాకర్‌కు, బండి సంజయ్‌కి సవాల్ విసిరారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.
తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దశాబ్ది దగా పేరుతో జూన్ 22న కేసీఆర్ 10 రకాల తలల వైఫల్యాలతో దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.