కేటీఆర్ ఇలాగే మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చ‌రిక‌

సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఎంపీల ఫోరమ్ కన్వీనర్ మల్లు రవి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  10 March 2025 9:14 PM IST
కేటీఆర్ ఇలాగే మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం.. కాంగ్రెస్ ఎంపీ హెచ్చ‌రిక‌

సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని ఎంపీల ఫోరమ్ కన్వీనర్ మల్లు రవి పేర్కొన్నారు. సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేటీఆర్‌కు సిగ్గు ఉండాలి.. ప్రధాని హోదాలో మోదీ హైదరాబాద్ వస్తే కేసీఆర్ కలవలేదు.. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్.. కేసీఆర్, కేటీఆర్ అని విమ‌ర్శించారు. బీఆర్ఎస్‌ హయాంలో వరి వేస్తే ఉరి అన్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. కేటీఆర్, కేసీఆర్ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల విజ్ఞత, ఆత్మగౌరవాన్ని అవమానపరిచినట్టు భావిస్తున్నానన్నారు. ఏ రకంగా కేసీఆర్ స్థాయికి సరిపొరు.. ప్రజలు రేవంత్ రెడ్డికి ఒక స్థాయి ఇచ్చార‌న్నారు. రేవంత్‌ను సీఎంగా, భట్టిని విక్రమార్కను డిప్యూటీ సీఎంగా ప్రజలు చేశారు.. కేటీఆర్ వ్యాఖ్యలు మాటలు పిచ్చి వ్యాఖ్యలు అన్నారు. కేటీఆర్, కేసీఆర్‌ల‌కు పిచ్చి పట్టిందని.. అందుకే ప్రజలు ఎన్నికల్లో ఓడించారన్నారు. లోక్ సభలో డిపాజిట్ రాకుండా ఓడించారు.. కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

కేటీఆర్ ఇలానే మాట్లాడితే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలు కేటీఆర్ పై తిరగబడతారు, దానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఇలానే మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం అని హెచ్చ‌రించారు.

Next Story