బంగ్లాదేశ్ తిరుగుబాటుకు, తెలంగాణకు ఏం సంబంధం..? : కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్‌

తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని ఎంపీ మల్లు రవి అన్నారు.

By Medi Samrat
Published on : 18 April 2025 3:24 PM IST

బంగ్లాదేశ్ తిరుగుబాటుకు, తెలంగాణకు ఏం సంబంధం..? : కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్‌

తెలంగాణలో ప్రజల తిరుగుబాటుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్‌పై అక్కసు ఎందుకు అని కేటీఆర్‌ను ప్ర‌శ్నించారు. పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బంగారు కేసీఆర్ కుటుంబంగా మారిందన్నారు. ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు.

బంగ్లాదేశ్‌లో ప్రజలు తిరిగిపడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయనటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దేశ చరిత్రలో మొదటిసారిగా పేదల కోసం సన్న బియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చింది. సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మక నిర్ణయం అన్నారు. సమీక్షృత గురుకుల పాఠశాలలను 200 కోట్లతో రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. ప్రపంచ స్థాయి విద్య , మౌలిక సదుపాయాలను రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ప్రపంచ స్థాయి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను రేవంత్ రెడ్డి, మంత్రులు బృందం తీసుకొచ్చింది. లక్ష మంది ఉద్యోగులతో బీసీ కుల గణనను చేసి చట్ట బద్దత కల్పించారు రేవంత్ రెడ్డి.. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ తల్లి బిడ్డలే.. బంగ్లాదేశ్ తిరుగుబాటుకు.. తెలంగాణకి ఏం సంబంధం కేటీఆర్ అని మండిప‌డ్డారు.

ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది. 16 లక్షలు మంది ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతున్నారు.. రైతులు, అధికారుల మేలు కోసం భూభారతిని సీఎం రేవంత్, మంత్రులు బృందం తీసుకొచ్చిందన్నారు. ప్రగతి భవన్‌లో ప్రజలు కనపడకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.. రేవంత్ హ‌యాంలో ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలు వెళ్లేందుకు వీలు కల్పించారన్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో ఏడాదిన్నరలో 60 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామ‌ని పేర్కొన్నారు.

Next Story