రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి చేశారు : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు
By Medi Samrat Published on 12 Nov 2024 11:18 AM GMTప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని పథకం ప్రకారం బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. కొడంగల్ లో భూసేకరణపై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారు.. బీఆర్ఎస్ నేతల ఆదేశాలతోనే రైతుల ముసుగులో కలెక్టర్ పై దాడి చేశారు.. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చూపించాలనే డ్రామాలో భాగంగానే కొడంగల్ ఘటన చేశారన్నారు. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు నిమిష నిమిషానికి ఫోన్లు చేసి, మందు సేవించి కలెక్టర్ పై దాడి చేశారని ఆరోపించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడికాదు.. ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడు హింస మార్గంలో పోరాటం చేయలేదు.. అహింస మార్గంలోనే మేము కేసీఆర్ పై పోరాడామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. కుటుంబ సభ్యుల మేలుకే కేసీఆర్ పదేళ్లు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
దాడి చేయించి కేటీఆర్ ఢిల్లీ వచ్చి బీజేపీ పెద్దలతో అంతకుముందే ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగా గతంలో బీజేపీ సహకరించిన విషయాలను గుర్తుచేసి అమృత్ భారత్ స్కాం అంటూ పిర్యాదు చేయడానికి వచ్చారన్నారు. బీజేపీ నేతలను రెచ్చగొట్టి, రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు.
ఏ ప్రాజెక్టు పనులైన టెండర్లు పిలిచే పనులు అప్పగిస్తారు.. ఆధారలుంటే సీబీఐకి ఇవ్వండి అని సూచించారు. రేవంత్ రెడ్డి సొంత బావమరిది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందుల ఉపేందర్ అమృత్ భారత్ పనుల్లో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్తున్నారని.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. మోదీ, అమిత్ షా అదేశల మేరకు పోటీకి దూరంగా ఉన్నారన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాకుండా శత్రువులుగా పనిచేస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం అడ్డుకునేలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఅర్ఎస్ పార్టీ.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత వారికి లేదన్నారు. బీఆర్ఎస్ హయంలో కలెక్టర్లను, ఎస్పీలను, ప్రభుత్వ ఉద్యోగులను కూలీవారిలా ట్రీట్ చేశారు.. మేము అధికారుల్లాగా ట్రీట్ చేస్తున్నామన్నారు.
మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేతలు దాడికి గురైన వాళ్ళను చూడకుండా.. దాడిని చేసిన వారిని చూడటానికి వెళ్తున్నారంటేనే మీ వైఖరి ఏంటో స్పష్టం అవుతోందన్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు బయటపెట్టండి, అంతేకాని ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ప్రజలే బీఆర్ఎస్ నేతలకు సరైన గుణపాఠం చెప్తారు.. నిర్మాణాత్మక సూచనలు చేయకుండా దాడులకు పాల్పడటం సరైందికాదన్నారు. కొడంగల్ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేనే లేఖ రాస్తానని పేర్కొన్నారు.