త్యాగానికి సిద్ధమంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  29 Aug 2023 9:45 PM IST
త్యాగానికి సిద్ధమంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం నల్లగొండ నియోజకవర్గ సీటు త్యాగం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ మాట్లాడాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని, దీనికి అందరం మూకుమ్మడిగా అంగీకారం తెలిపామని అన్నారు. అందరి బలాలు పరిశీలిస్తామని, సమర్థులకే టికెట్లు కేటాయిస్తామని అన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు టికెట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందన్నారు. అవసరం అనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిక్లరేషన్లు అమలు చేస్తామని.. లేకుంటే రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. మూడెకరాలిస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. మాట తప్పితే తల నరుక్కుంటానని ఆనాడు కేసీఆర్ అన్నారని.. ఇప్పుడు ఏం చేశారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లారంటే ఏదో మతలబు ఉందని అన్నారు.

Next Story