రాష్ట్రానికి నిధులు తీసుకురావడం ఆ కేంద్రమంత్రులకు చేతకాదు: కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్రానికి తాటికాయ అంత అన్యాయం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

By Knakam Karthik
Published on : 23 March 2025 5:12 PM IST

Telangana, Congress Mp Kiran kumar reddy, Bjp, Brs

రాష్ట్రానికి నిధులు తీసుకురావడం ఆ కేంద్రమంత్రులకు చేతకాదు: కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు రాష్ట్రానికి తాటికాయ అంత అన్యాయం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై విమర్శలు చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి చేసేది ఏమీ లేదు. తెచ్చేది ఏమీ లేదు..అని విమర్శించారు. బియ్యం గింజంత సహాయం చేయడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడం ఇద్దరు కేంద్రమంత్రులకు చేతకాదని ఎద్దేవా చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన, ఇన్ఫ్రాస్ట్రక్షరు, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. కేంద్రానికి మనం రూపాయి పంపిస్తే తిరిగి నలభై పైసలు వస్తున్నాయి అదే బిహార్‌కు ఆరు రూపాయలు, యూపీకి మూడు రూపాయలు వస్తున్నాయ్. దీని గురించి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడరు? అని కిరణ్‌ కుమార్ ప్రశ్నించారు.

నియోజకవర్గాల పునర్విభజనపై దొంగల ముఠా అంతా కలిసి తమిళనాడులో మీటింగ్ పెట్టుకున్నారని బండి సంజయ్ అనడం తగదు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియెజకవర్గాల పునర్విభజన అనేది దుర్మార్గపు ఆలోచన. ఇది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. దొంగల ముఠా అయితే మీ దగ్గరే సీబీఐ, ఈడీ ఉన్నాయి ఎంక్వయిరీ చేసుకోవచ్చు కదా? రోడ్డుమీద పిచ్చోడు మాట్లాడినట్లు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. అని కిరణ్ కుమార్ మండిపడ్డారు. దేశంలో 543 ఎంపీ సీట్లు ఉంటే దక్షిణ రాష్ట్రాల్లో 130 సీట్లే ఉన్నాయి. నార్త్ ఇండియాతో మేము అధికారంలోకి వస్తాం, దక్షిణ రాష్ట్రాలతో మాకు అవసరమే లేదనే దుర్మార్గపు ఆలోచనతో బీజేపీ నాయకులు ఉన్నారు. కనీసం దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌లో 33 శాతం అయినా ఇవ్వాలని కోరుతున్నాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజకీయాలను పక్కనపెట్టి ప్రాంతీయ భావజాలంతో పని చేయాలని, అందరూ కలిసి డీలిమిటేషన్ కోసం పోరాడాల్సిందిగా కోరుతున్నానని.. కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

Next Story