కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు..కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 16 May 2025 2:28 PM IST

Telangana, Congress Mp Chamala Kirankumar, Brs, Congress

కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు..కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో ఎంపీ చామల మీడియాతో మాట్లాడుతూ.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. కేటీఆర్ కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారు. రామప్ప గుడి దగ్గర అత్యుత్సాహంతో ఎవరో మిస్ వరల్డ్ కంటెస్టంట్ల కాళ్లు కడిగి ఉండొచ్చు. దానికి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం ఏమైంది అంటూ సోనియాగాంధీకి ట్వీట్ చేశారు. పదేళ్లు ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదు. అలాంటి కేటీఆర్ మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నారు..అని ఎంపీ చామల విమర్శించారు.

బీఆర్ఎస్ అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తుంటే, కేటీఆర్ డిస్టర్బ్ చేస్తున్నారు. కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీది కేటీఆర్..అని ఎంపీ చామల ఆరోపించారు. జనాన్ని తప్పుదోవ పట్టించాలని కేటీఆర్ రోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో దండుకున్న వందల కోట్ల రూపాయలతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌తో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. మార్ఫింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొండా సురేఖ ఏం సందర్భంలో మాట్లాడారో ఆమె సమాధానం చెబుతారు..అని ఎంపీ చామల పేర్కొన్నారు.

Next Story