పదేళ్లుగా తెలంగాణను మేసింది బీఆర్ఎస్ నేతలే అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను సద్వినియోగం చేసుకోవాలి..అని ఎంపీ చామల కోరారు. తెలంగాణను అప్పుల కుప్పగా చేసినందుకు అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి..అని ఎంపీ చామల డిమాండ్ చేశారు.
బంగారు తెలంగాణ సాధన కోసం మేము పని చేస్తున్నాం. తెలంగాణకు లక్షా యాభై వేల కోట్లు అడిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నవ్వొస్తుందట. తెలంగాణ ప్రజల కోసమే మేము నిధులు అడుగుతున్నాం. తెలంగాణ ప్రజల ఓట్లతో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్రానికి సాయం చేయాల్సింది పోయి, వెటకారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడాన్ని కిషన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలను కిషన్ రెడ్డి పట్టించుకోరా, పదేళ్లు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుంటుంటే పట్టించుకోలేదు, ఎంపీ చామల ఆరోపించారు.