టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణంపై ఆయనకు ముడిపెడుతూ కాంగ్రెస్ ఎంపీ సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత కేదార్ శెలగంశెట్టి మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik
టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణంపై ఆయనకు ముడిపెడుతూ కాంగ్రెస్ ఎంపీ సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత కేదార్ శెలగంశెట్టి మృతిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిదాన్నీ సోషల్ మీడియాలో పోస్టు చేసే హరీష్ రావు దుబాయ్ టూర్ వివరాలను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నీ స్నేహితుడి కూతురు వివాహం 6వ తేదీన ఉంది.. మరి ఆరో తేదీన పెళ్లి ఉంటే...22వ తేదీన ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. హరీష్ రావు దుబాయ్ వెళ్లి రోజే కేదార్ అక్కడ చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకు శవ రాజకీయాలు కొత్త కాదని మండిపడ్డారు. కేదార్ మరణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి రాజకీయ నాయకులు దుబాయ్ వెళ్లారని ఎంపీ చామల ఆరోపించారు. లూటీ చేసిన నగదును దుబాయ్‌లో దాచుకోవడానికి హరీష్ రావు కూడా వెళ్లారని ఆరోపణలు చేశారు. ఎలక్షన్లు, కలెక్షన్లు హరీష్ రావు నినాదం అని.. ఎంపీ చామల ఆరోపించారు. ఆయన డిక్షనరీలో అగ్గిపెట్టె, రాజీనామాలు మొదటి పదాలు అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టాడు కానీ.. పనిపై చిత్తశుద్ధి లేదని విమర్శలు చేశారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఎల్‌ఎస్‌బీసీ పూర్తి చేసేవారని, గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లారా? అని ప్రశ్నించారు. ప్రతి రోజు మధ్యాహ్నం తొడలు కొట్టడానికి బీఆర్‌ఎస్ నేతలు బయటకు వస్తారని ఎద్దేవా చేశారు.
ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ https://t.co/Tx7ynhDrSx
— Telangana Congress (@INCTelangana) March 3, 2025