కేటీఆర్ సైనికుడు కాదు : ఎంపీ చామల
కేటీఆర్ సైనికుడు కాదు.. యువరాజు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు.
By Medi Samrat Published on 9 Jan 2025 3:58 PM ISTకేటీఆర్ సైనికుడు కాదు.. యువరాజు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. మాకు డబ్బు వ్యామోహం లేదు అని కేటీఆర్ అంటున్నాడు.. కమిషన్ల కోసమే మీ సోదరి MLC కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేశారు.. కేటీఆర్.. మరో సారి తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టద్దని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. మీకు డబ్బు వ్యామోహం లేదంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. రూ. 7 లక్షల కోట్లలో కాంట్రాక్టర్లకు ఎన్ని లక్షల కోట్లు అప్పనంగా ముట్ట చెప్పారు చెప్పాలన్నారు. పాత పాటలు పాడొద్దు కేటీఆర్ గారు.. కొత్త ముచ్చట చెప్పండి.. తెలంగాణ ప్రజలు నమ్ముతారన్నారు.కేటీఆర్ సైనికుడు కాదు : ఎంపీ చామల
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేటీఆర్ సైనికుడు కాదు.. కేసీఆర్ కొడుకు మాత్రమే.. అధికారం కోల్పోయిన యువరాజుకు మతిభ్రమించి మాట్లాడుతున్నాడన్నారు. మీ నాయన 2002లో ఏదైతే నినాదంతో వచ్చాడో.. ఈరోజు మీరు కూడా అదే నినాదం చెబుతున్నారు.. తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దళిత ముఖ్యమంత్రి, ఉద్యోగ నియామకాలు, కాపల కుక్క అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు.. మీరు అప్పు చేసిన ఏడు లక్షల కోట్లు సరైన పద్ధతిలో ఖర్చు చేసుంటే కేజీ టు పీజీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా, హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం ఇవన్నీ అందేవన్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తాం, తెలంగాణకు కాపల కుక్కలాగా ఉంటానని అంటే మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లేశారు.. చేసిన ఏడు లక్షల కోట్లలో అప్పులో లక్ష కోట్లు దండుకున్నది మీ కుటుంబం అని ఆరోపించారు.