దేశంలో ఓట్ల చోరీ గురించి టీపీసీసీ చీఫ్ మాట్లాడితే..దానిపై స్పందించకుండా బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు..అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. కార్పొరేటర్ లాగా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ఓటు చోరీ గురించి మహేష్ గౌడ్ మాట్లాడితే దానికి ఏదేదో మాట్లాడుతున్నారు. ఓట్ చోరీ మీద క్లియర్‌గా రాహుల్‌గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకే ఇంటి మీద 100 ఓట్లు ఉన్నాయి. ఒక పబ్బు పేరు మీద 78 ఓట్లు ఉన్నాయి. బెంగళూరులో దొంగ ఓట్ల గురించి కూడా చెప్పాము. దీనిపైన పార్లమెంట్‌లో చర్చ చేయాలని చెప్పి పట్టు పట్టాం. నిజంగా అది జరగకపోతే చర్చ జరపాలి కదా మీరు కూడా హౌస్‌లోనే ఉన్నారు కదా. చర్చ కోసం మేము పట్టుబడుతుంటే ఒకవైపు స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూ ద్వారా 65 లక్షల ఓట్లు తొలగించారు. బీహార్‌లో మైనారిటీలు క్రిస్టియన్ల ఓట్లని తొలగించారు. అంటే మీకు ఆ ఓట్లు పడవనే కదా తీసేశారు. చర్చ చేస్తే ఎవరు దొంగ బయటపడుతుంది కదా..అని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.
కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారు. ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేవలం రాజకీయం మాట్లాడాడు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడా? ఓటు చోరీ గురించి చర్చ పెట్టకుండా కరీంనగర్ గురించి మాట్లాడుతున్నారంటే ఇది కరెక్టేనా . మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కేవలం కాంగ్రెస్‌ని ఓడించాలని ఉద్దేశంతోనే న్యూట్రల్ బాడీని కేంద్రం ఆపరేట్ చేస్తుంది అని మేము క్లియర్ గా చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు గుర్తులేదా. 65 లక్షల తొలగించిన ఓటర్ల లిస్టు ని వెబ్‌సైట్లో పెట్టాలని చెప్పారు అది కూడా గుర్తులేదా..అని బండి సంజయ్‌ను కాంగ్రెస్ ఎంపీ చామల ప్రశ్నించారు.