బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్ట్‌లు చేయాలి : ఎంపీ అనిల్ కుమార్‌ యాదవ్

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్ట్‌లు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు

By Kalasani Durgapraveen  Published on  29 Oct 2024 12:55 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్ట్‌లు చేయాలి : ఎంపీ అనిల్ కుమార్‌ యాదవ్

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్ట్‌లు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని స‌వాల్ విసిరారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని వెనకేసుకుని రావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

గతం ప్రభుత్వం డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించారో ప్రజలకు తెలుసన్నారు. జన్వాడ పామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అన్నారు. ఒక సారి దీపావళి పెస్టివల్, ఇంకో సారి గృహ ప్రవేశం అంటున్నారు.. డ్రగ్స్ ని స్కూల్ పిల్లల వరకు తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వానిది అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ప్రీ రాష్ట్రంగా చేస్తుంటే.. వాళ్ళు డ్రగ్స్ ని ప్రేరేపించాలని చూస్తున్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఏమి చేయాలనుకుంటుందని ప్ర‌శ్నించారు.

స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకుండు.. రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి ఒప్పుకుండు.. ఇప్పుడు స్టేట్మెంట్ ను మారుస్తుండు.. పాంహౌస్ దొర కేసిఆర్ డిజిపికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండని ఆరోపించారు. ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి.. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడ‌ని ప్రజలు అడుగుతున్నారని అనిల్ యాదవ్ వ్యాఖ్యానించారు.

Next Story