ఎమ్మెల్యేను దేశం దాటించాలని చూశారు.. కేటీఆర్, హరీష్‌లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫైర్
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నందుకు కేటీఆర్, హరీష్ రావులకు సిగ్గుండాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు
By Medi Samrat
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నందుకు కేటీఆర్, హరీష్ రావులకు సిగ్గుండాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నువ్వు చేసిన అక్రమాలు నీ పిల్లలకు చెప్పు లేకపోతే నీ బిడ్డ, నీ అల్లుడు నిన్ను జైలుకు పంపుతారు కేసీఆర్ జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు.
పైసల దందాలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.. కేటీఆర్, హరీష్ రావుకు సిగ్గుండాలీ.. ఒక్క దొంగకు సపోర్ట్ చేస్తున్నారు.. ప్రజా సమస్యలపై కౌశిక్ రెడ్డి ఏమైనా ఉద్యమం చేసాడా అని మండిపడ్డారు. క్రషర్ వాళ్లను పైసల కోసం బ్లాక్ మెయిల్ చేస్తే అరెస్ట్ చేశారు. క్రషర్ వాళ్ళు కేసు పెట్టిన తరువాత.. గుండెడు గ్రామ ప్రజలకు గుడి కోసం రూ.10 లక్షల చెక్ ఇచ్చాడు. కౌశిక్ రెడ్డి ది బ్లాక్ మెయిల్ చరిత్ర.. ఉద్యోగాలు ఇప్పిస్తానని కౌశిక్ రెడ్డి పైసలు తీసుకున్నారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దొంగలను బయట దేశాలకు పంపినట్టు.. కౌశిక్ రెడ్డిని కూడా దేశం దాటించాలని చూశారన్నారు. ప్రజల్ని మోసం చేసిన ఘటనలు కోకొల్లలున్న చరిత్ర కౌశిక్ రెడ్డిది. బ్లాక్ మెయిలర్, దొంగ మా ఎమ్మెల్యే నా అని హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు బాధ పడుతున్నారన్నారు. దొంగలకు సపోర్ట్ చేయకండి కేటీఆర్, హరీష్ రావు అని సూచించారు.
మీరు చేసిన దొంగతనాలు బయట పడతాయని బావ బామ్మర్ధులు బనకచర్ల విషయంలో ముందుగానే మాట్లాడుతున్నారు. బనకచర్ల విషయంలో జగన్‌తో లోపాయికార ఒప్పందాలు చేసుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. బావ, బామ్మర్ధులకు దమ్ము, ధైర్యం ఉంటే బనకచర్ల విషయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
వాసాల మర్రిలో ఆగమ్మకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇళ్లు కట్టలేదు.. కల్వకుంట్ల కవిత గారు మీ నాన్న పేపర్ టైగర్.. ఆగమ్మకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆగమ్మకు మీ అయ్య ఇల్లు ఇచ్చి ఉంటే మేము ఇల్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చేదని మీడియా ముఖంగా నిలదీశారు.