కేటీఆర్‌ నోటీసులు పంపారు.. ఆ పరిజ్ఞానం ఆయ‌న‌కు లేదు : ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి

కేటీఆర్ మాకు లీగల్ నోటీసులు పంపారని.. ఆయ‌న‌కు లా, ఆడ్మినిస్ట్రేటివ్ పరిజ్ఞానం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  4 April 2024 4:02 PM IST
కేటీఆర్‌ నోటీసులు పంపారు.. ఆ పరిజ్ఞానం ఆయ‌న‌కు లేదు : ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి

కేటీఆర్ మాకు లీగల్ నోటీసులు పంపారని.. ఆయ‌న‌కు లా, ఆడ్మినిస్ట్రేటివ్ పరిజ్ఞానం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వార్ రూమ్ లు ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. మీడియాలో వార్తలను చూసి విచారణ జరపమని డీజీపీకి ఫిర్యాదు చేశాను.. నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనుమానంతో ఫిర్యాదు చేశాన‌ని.. ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ లో కూర్చొని పరిపాలన చేశారని అర్థమవుతుందని దుయ్య‌బ‌ట్టారు.

ఇప్పటికే అధికారులు సస్పెండ్ అయ్యారు. లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారు. టాస్క్ పోర్స్‌ వాహనాలలో డబ్బులు చేరవేసినమని రిమాండ్ లో ఉన్న పోలీసు అధికారులు చెప్పారు. ఇందిరాగాంధీ ఆఫీషియల్ గా వాహనాలు వాడుకుందని, అలహాబాద్ కోర్ట్ డిస్ క్వాలిఫై చేసింది. దీని ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు అందరూ అనర్హులన్నారు.

రేవంత్ రెడ్డి రూ. 2500 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టారని అన్న మాటలకు మేము నీకు లీగల్ నోటీసులు ఇవ్వాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే శుభకార్యానికి కార్డు ఇవ్వడానికి వెళితే తప్పుడు ప్రచారం చేశారు.. నాయకులపై కుట్రలు, కుతంత్రాలు చేసే కుటుంబమ‌న్నారు. మునుగోడు బై పోల్ లో సర్వే ఎజెంట్లను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. వాళ్ళ ఎమ్మెల్యేల కదలికలపై ట్యాపింగ్ చేశారు. హై కోర్ట్ జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని మీడియా కథనాలలో వచ్చింది.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, కే మీడియా సమక్షంలో ట్యాపింగ్ చేశామని చెప్పారు. వీడియో లు కూడా ప్రదర్శించారని పేర్కొన్నారు.

ట్యాపింగ్ తీవ్రవాదుల కదలికలపై నిఘా కోసం చేస్తారని.. కానీ ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడం చరిత్రలో లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ లు అన్ని ప్రగతి భవన్ వేదికగా జరిగాయ‌ని ఆరోపించారు. గత ప్రభుత్వం లో ఉన్న అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందన్నారు. డీజీపీకి తెలియకుండా స్పెషల్ టీం ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.

Next Story