సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం తక్కువ మాట్లాడి, మంత్రివర్గంలో అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి. మేధావులతో చర్చించి. ఆవేశంతో కాకుండా మాట్లాడాలని సూచించారు. ఇంకా మూడు సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారనేది తర్వాత చూద్దాం..కానీ అప్పటివరకు గంటలు గంటలు స్పీచ్ ఇవ్వకుండా పని మీద దృష్టి పెడితే బాగుంటుంది..అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు..అని ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ చేశారు. ఉన్న కాలం మొత్తం రిపోర్టులు, కమిషన్లతోనే గడిచిపోయేలా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది..ఇప్పటివరకు ఏం చేశారు.?..అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.