నువ్వు అమెరికాలో ఉండి లాటరీలో మంత్రివి అయ్యావు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంట‌ర్‌

కేటీఆర్.. దమ్ముంటే శివారెడ్డి పల్లి రావాలని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి స‌వాల్ విసిరారు.

By Medi Samrat  Published on  3 Feb 2025 5:33 PM IST
నువ్వు అమెరికాలో ఉండి లాటరీలో మంత్రివి అయ్యావు.. కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంట‌ర్‌

కేటీఆర్.. దమ్ముంటే శివారెడ్డి పల్లి రావాలని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి స‌వాల్ విసిరారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల ఋణమాఫీ అయ్యింద‌ని.. నువ్వు ఆర్టీఐ మీద దరఖాస్టు చేస్తే తెలుస్తది.. అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీకి దరఖాస్తు చేసుకుంటే డాటా ఇస్తడు.. మీ ప్రభుత్వంలో శివారెడ్డి పల్లిలో ఋణమాఫీ ఎంత అయ్యింది.? మా ప్రభుత్వంలో ఎంత ఋణమాఫీ అయిందో చర్చిద్దామ‌న్నారు. మా ప్రభుత్వం శివా రెడ్డి పల్లిలో కోటి 66 లక్షల ఋణమాఫీ చేసింది.. మీరు చేసిన చారాణా ఋణమాఫీ వడ్డీకి సరిపోలేదన్నారు. వికారాబాద్‌లో ఒక్క రైతుకైనా మీరు ఋణమాఫీ చేశారా.? అని ప్ర‌శ్నించారు.

అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ పేరుతో పరిగి వచ్చిండు.. అంబేద్కర్ గురించి మాట్లాడితే మేము స్వాగతిస్తాం.. కేటీఆర్ ఒక్క మాట అంబేద్కర్ గురించి మాట్లాడి.. 99 మాటలు నా గురించి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండు.. రేవంత్ రెడ్డి లాటరీ ముఖ్యమంత్రి అంటుండు.. నువ్వు అమెరికాలో ఉండి లాటరీతో మంత్రివి అయ్యావు కేటీఆర్.. నువ్వు, నీ బావ, నీ చెల్లె కవిత లాటరీ బ్యాచ్ అంటూ సెటైర్లు సంధించారు. పార్ములా కార్ రేసులో నీ మీద ఒక వైపు ఏసీబీ, మరొక వైపు ఈడీ విచారణ జరుగుతుంది.. నీ చెల్లి లిక్కర్ కుంభకోణంలో జైలుకు పోయి బయటకు వచ్చింది.. కేసీఆర్ కాళేశ్వరం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ ఎదుర్కొంటున్నార‌న్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి నియోజక వర్గంలో ఫైలెట్ ప్రాజెక్టు కింద మండలంలో ఒక గ్రామంలో అందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేశామ‌న్నారు. దుబాయ్, సింగపూర్‌లో కేటీఆర్ ఎంత మందిని పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్ లు చేసినా ప్రజలు నమ్మరు అన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేటీఆర్ అబ‌ద్దాలు మాట్లాడుతుండు.. కేటీఆర్ ఇట్లాగే అబ‌ద్దాలు ఆడితే ప్రజలు నిన్ను బయట తిరగనివ్వరన్నారు.

Next Story