డీఎస్సీ చక్కగా రాయండి.. గ్రూప్ -2 వాయిదాపై సర్కార్ ఆలోచన చేస్తుంది : ఎంపీ చామల

బేగం పేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.

By Medi Samrat  Published on  18 July 2024 1:49 PM IST
డీఎస్సీ చక్కగా రాయండి.. గ్రూప్ -2 వాయిదాపై సర్కార్ ఆలోచన చేస్తుంది : ఎంపీ చామల

బేగం పేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, మానవతారాయ్, చరణ్ కౌశిక్ త‌దిత‌రులు నిరుద్యోగులతో భేటీ అయ్యారు. నిరుద్యోగులతో చర్చించి స‌మ‌స్య‌ల‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు నేత‌లు. ఈ భేటీలో నిరుద్యోగులు త‌మ ప్ర‌ధాన డిమాండ్ల‌ను నేత‌ల ముందు ఉంచారు. ప్రధానంగా గ్రూప్ -2 నవంబర్ చివరికి లేదంటే డిసెంబర్ నెలకు వాయిదా వేయాలి.. పోస్ట్‌ల‌ను పెంచాలని, గ్రూప్ -1 లో 1:100 విధానంలో నియామ‌కం జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు.

దీనిపై గ్రూప్ -1లో 1:100 తీయడం సాధ్యం కాదని.. టెక్నికల్ సమస్యలు వస్తాయ‌ని ఎంపీ చామ‌ల వివరించారు. సీఎంకు ద‌గ్గ‌ర‌కు వెళ్లి అన్ని విషయాలు వివరిస్తాను.. నిర్ణయం సీఎం తీసుకుంటారని చెప్పారు. డీఎస్సీ చక్కగా రాసుకోండని సూచించారు. గ్రూప్ -2 వాయిదా వేయడానికి సర్కార్ ఆలోచన చేస్తుందని.. మీరు ఆందోళన చేయొద్దన్నారు.

నిరుద్యోగుల పట్ల సీఎం సానుకూలంగా వున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలనీ సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారు. పదేండ్లలో కేసీఆర్ ఎన్ని భర్తీ చేశారో అందరికి తెలుసు.. కాంగ్రెస్ మూడు నెలల కాలంలో 30 వేల ఉద్యోగాల భర్తీ చేసింది. జాబ్ క్యాలెండర్ ఉంటుంద‌న్నారు.

Next Story