ఎగ్జిట్ పోల్స్ చూస్తే నాకు నిద్రపట్టలేదని.. మీడియా మొత్తం ఉదరగొట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంత రావు అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పదేళ్లలో ఏం చేయలేదన్నారు. అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నాడన ఆరోపించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని గుర్తించారు.. రిజర్వేషన్ పెంచేందుకు కుల గణన చేయాలని భావించారన్నారు.
ఆప్ కి బార్ ఛార్ సౌ పార్ అన్న మోదీని ప్రజలు నమ్మలేదన్నారు. ఉత్తరప్రదేశ్ లో 44 సీట్లు కూటమి గెలుస్తుంది అంటే మోదీని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు.
తెలంగాణలో బీజేపీ 8 సీట్లు గెలవడం.. BRS ఫెయిల్యూర్ మాత్రమేనన్నారు. కేసీఆర్ ఇక్కడి రైతులను పట్టించుకోక బీహార్, పంజాబ్ రైతులకు డబ్బులు ఇచ్చాడన్నారు. మోదీ దేవుడు మీద ఆధారపడినా ప్రజలు ఆదరించడం లేదన్నారు.