బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అనేక ఆరోపణలు చేస్తున్నారని.. మహిళ CRPF అధికారి చెంప దెబ్బ కొట్టినా మారడం లేదని మాజీ ఎంపీ వీ హనుమంత రావు అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ప్రతిపక్ష నాయకుడి రాహుల్ గాంధీ కి డ్రగ్స్ అలవాటు ఉంది.. అనే ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఆయన చెత్త ప్రసంగాలు చేస్తాడు అని కామెంట్ చేయడం పట్ల మేము హార్ట్ అయ్యామన్నారు. కంగనా మీద అంబర్ పేట్ PS లో కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ లాంటి వాళ్ళను బీజేపీ ప్రోత్సహిస్తే.. ప్రజలు తిరగబడుతారన్నారు. కంగనా రనౌత్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నడ్డా మీద ఉందన్నారు. కంగనా మీద చర్యలు తీసుకుంటే సిస్టమ్ తెలుస్తుంది.. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెపై కేసులు నమోదు చేయాలని డీజీపీ, కమిషనర్ లకు విజ్ఞప్తి చేశారు.
హైడ్రా రంగనాథ్ మంచి పనిచేస్తున్నారని అభినందించారు. పేదల ఇండ్లు కూల్చితే.. డబుల్ బెడ్ రూం ఇండ్లు వాళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబర్ పెట్ లోని ముస్లిం స్మశాన వాటికలో కూడా ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు.. దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా ప్రజల వైపు నిలబడాలని సూచించారు. కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణం చేపట్టినా కూల్చేస్తామని సీఎం ప్రకటన చేశారని గుర్తుచేశారు.