కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నెహ్రూ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఆరోపించారు. వీర్ సావార్కర్ ను ప్రమోట్ చేస్తున్నారు.. వీర్ సావార్కర్ బ్రిటీష్ వాళ్లకు సహకరించాడు.. స్వతంత్ర ఉద్యమంలో బ్రిటీష్ వాళ్ల తో కాంప్రమైజ్ అయ్యాడు.. వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి ఏజెంట్ గా పనిచేశాడని అన్నారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వారు దేశ భక్తులా..? లేక బ్రిటీష్ వాళ్లకు లొంగి పనిచేసిన వీర్ సావర్కర్ దేశ భక్తుడా..? అని ప్రశ్నించారు. వీర్ సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్న బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీజేపీలో ఎవరూ స్వతంత్ర సమరయోధులు లేరు.. టిప్పు సుల్తాన్ వారసులను దేశం నుంచి వెళ్ళగొట్టాలి అంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు అనడం దుర్మార్గం అని అన్నారు. రాముడిని పూజించే వాళ్ళే దేశంలో ఉండాలని చెప్పడం సరికాదని అన్నారు. టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడిన సిద్దారామయ్య ను ఖతం చేయాలని కర్ణాటక మంత్రి చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేసి.. రిజర్వేషన్స్ ఎత్తేసే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నాయకులు అదానీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.