బీజేపీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్త మీద చేసిన కామెంట్స్ వివాదమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. బీజేపీ ఆలోచన.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు రోజు కొక కామెంట్స్ తో వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ మసీదులను తవ్వాలంటాడు.. కర్నాటక లో ఈశ్వరప్ప జాతీయ జెండాను మారుస్తామంటారు.. వీళ్ల జాగీరా..? అని ఫైరయ్యారు. ఇతర మతాల వారిని కించ పరచడమేనా .. బీజేపీ ఏజెండా అని దుయ్యబట్టారు.
గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న వారి పరిస్థితి ఏంటి.. గల్ఫ్ నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నాం.. ఇవ్వం అంటే ఏంటి పరిస్థితి అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన వారిని జైల్లో పెట్టాలని అన్నారు. హిందూ-ముస్లిం మధ్య చిచ్చు పెట్టి ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తున్నారని.. బీజేపీకి మూడోసారి అవకాశం ఇస్తే.. దేశం ముక్కలు అవడం ఖాయమని ఫైర్ అయ్యారు. ఇదిలావుంటే.. రేప్ చేసే వారికి మరణశిక్ష విధిస్తే.. ఇలాంటి కేసులు తగ్గిపోతాయని.. న్యాయస్థానం త్వరతగతిన నిర్ణయాలు తీసుకుంటే.. నేరాలు తగ్గుతాయని జూబ్లిహిల్స్ అత్యాచార ఘటనపై స్పందింస్తూ వ్యాఖ్యలు చేశారు.