తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాగాంధీ దూరం

అనారోగ్య కారణాల రీత్యా జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరవ్వడం లేదని తెలుస్తోంది

By Medi Samrat  Published on  1 Jun 2024 7:13 PM IST
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియాగాంధీ దూరం

అనారోగ్య కారణాల రీత్యా జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరవ్వడం లేదని తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆయన న్యూఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని స్వయంగా వేడుకలకు ఆహ్వానించారు. అంతేకాకుండా ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరిస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ వేడుకలకు సోనియా గైర్హాజరవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె కుమారుడు రాహుల్ గాంధీపై ఆశలు పెట్టుకున్నారు.

జూన్ 2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవడంతో ఆమె నుండి వీడియో బైట్ వచ్చే అవకాశం ఉందని ఆశిస్తూ ఉన్నారు.

Next Story