మా పోరాటం వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపింది

Congress Leader Pawan Khera. మా పోరాటం వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపింది

By Medi Samrat  Published on  11 March 2023 2:59 PM IST
మా పోరాటం వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపింది

శంషాబాద్ లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో ఇంకో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తుంది. కవితకి మహిళ సాధికారత గురించి ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా? అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్లే.. లిక్కర్ స్కాంలో కదలిక వచ్చిందని అన్నారు. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ మద్దతు ఎందుకు తెలుపుతుంది? లిక్కర్ స్కాం పై ఫిర్యాదు చేసిందే మేము అని స్ప‌ష్టం చేశారు.

కవిత ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో మహిళల హక్కుల కోసం ఎన్నిసార్లు మాట్లాడింది? అని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారే క్రమంలో కావాల్సిన డబ్బులు ఇక్కడి నుండి వస్తున్నాయి? అని నిల‌దీశారు. సామాన్య ప్రజల నుండి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం వాడుకుంటుంది. బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని పిలుపునిచ్చారు. మా పోరాటం, ఒత్తిడి వల్లే సీబీఐ కవిత ఇంటికి వచ్చి విచారణ జరిపిందని పేర్కొన్నారు. తెలంగాణలో తప్పితే వేరే రాష్ట్రంలో ఒక్క సర్పంచ్ ను కూడా గెలిపించుకునే పరిస్థితి బీఆర్ఎస్‌కు లేదని అన్నారు.


Next Story