TSPSC : క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

Congress Leader, MLC Jeevan Reddy. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ప్రజాసమస్యలు పక్కదారి పడుతున్నాయని

By Medi Samrat  Published on  20 March 2023 2:45 PM IST
TSPSC : క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

MLC Jeevan Reddy


రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ప్రజాసమస్యలు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగ యువత నైరశ్యానికి లోనయ్యారని అన్నారు. ఆత్మహత్యలు, బలిదానలతో రాష్ట్రం సాధించుకున్నామ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగం లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కల్పించాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేట్ రంగంలో 50% ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తామ‌న్నారు. గడిచిన 8 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామకాలు లేనప్పడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు కల్పించాలి. టీఎస్‌పీఎస్సీలో చొరబడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి పేపర్ లీకేజీ చేసాడని.. టీఎస్‌పీఎస్సీ కు విశ్వసనీయత ఉండాలని అన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ పై సిట్ విచారణ.. హై కోర్ట్ సిటింగ్ జడ్జి పర్యవేక్షణతో జరిపించాలని అన్నారు.

నిరుద్యోగ యువతలో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పేపర్ లీకేజీలో.. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోనే విచారణ జరపడం దురదృష్టక‌రం అని విమ‌ర్శించారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు లక్ష రూపాయిల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.


Next Story