15 రోజులుగా సీఎం కేసీఆర్ చీకట్లోకి వెళ్ళిపోయారని.. కేసీఆర్ పాలన చూస్తే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా అనిపిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంగంట్లో అమ్మకానికి పెట్టిన సరకుగా మారిందని అన్నారు. రాష్ట్రంలో భార్యాభర్తలు కలిసి సంసారం చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కి నైతికత ఉంటే సీఎం పదవి నుండి తప్పుకోవాలన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుందన్నారు.
మెగా డీఏఎస్సీ కోసం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పాత్ర గొప్పది. ఉద్యమకారులను వివక్షకు గురిచేయడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం.. 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. 5% ఐఆర్ నిర్ణయాన్ని ప్రభుత్వం పున:పరిశీలించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 20% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన మూడు పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు.