Telangana: సీఎంను తిడితే నాలుక కోస్తాం: జగ్గారెడ్డి
తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Sep 2024 9:30 AM GMTతెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఎపిసోడ్.. ప్రాంతీయ విభేదాల వరకూ వెళ్లింది. అయితే.. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నేతలకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోము అన్నారు. మా సీఎంను పనికి రాని వాడు అంటే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. కేటీఆర్, కేసీఆర్ ఎవరైనా సరే రేవంత్‌రెడ్డి తిడితే ఊరుకునేది లేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవానల్నారు. హరీశ్‌రావుని ఎలుగుబంటి కరిచినట్లుందనీ జగ్గారెడ్డి అన్నారు.
తెలంగాణలో అనసవరంగా రచ్చ చేస్తోంది బీఆర్ఎస్సే అన్నారు జగ్గారెడ్డి. హైదరాబాద్‌లో ప్రజల మూడ్‌ని మొత్తం కరాబ్ చేశారని అన్నారు. వినాయకుడి పూజలు చూడకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేశారన్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని చూపించే టీవీలు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లొల్లినే చూపిస్తున్నాయన్నారు. రోడ్డుపైకి కేసీఆర్ ఫ్యామిలీ వచ్చిందనీ.. పోలీసులు ఒక పక్క గణేష్ మండపాల వద్ద బందోబస్తులో ఉంటే ఇవన్నీ అవసరమా అంటూ ప్రశ్నించారు. అయితే.. అసలు ఆంధ్ర ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నదే బీఆర్ఎస్ అని జగ్గారెడ్డి అన్నారు. చేపల పులుసు కూడా వారే తిన్నారనీ.. ఆంధ్రావారికి టికెట్ ఇచ్చారని చెప్పారు. అధికారం కోల్పోయే సరికి బీఆర్ఎస్ నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదనీ.. అందుకే ఇలాంటి వివాదాలకు తెరతీస్తున్నారని విమర్శించారు.
బీజేపీ డైరెక్షన్‌లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని జగ్గారెడ్డి అన్నారు. నీతి మాలిన, నియమాలు లేని పాలనగా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిందని విమర్శించారు. కేసీఆర్ తాతలు విజయనగరం నుంచి వచ్చారనీ.. అందకే కేటీఆర్‌కు ఆంధ్ర భాష వచ్చిందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రెండురోజులుగా హరీశ్‌రావు దూకుడు చూస్తుంటే.. ఆయన్ని ఎలుగుబంటి కర్చినట్లు అనిపిస్తోందని అన్నారు. బీజేపీకి రాజకీయం తప్పిందే ఏమీ తెలియదు.. కౌశిక్ పంచాయతీ విషయంలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కు క్లారిటీ ఉందన్నారు కాంగ్రెస్ సీనియ్ నేత జగ్గారెడ్డి.