కేసీఆర్ బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు

కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో జైల్ కి వెళ్ళిందని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat  Published on  19 March 2024 3:02 PM IST
కేసీఆర్ బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు

కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో జైల్ కి వెళ్ళిందని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. క‌విత‌ కేవలం లీక్కర్ మాత్రమే కాదు.. వేలకోట్ల అవినీతి సొమ్ముతో విదేశాలలో పెట్టుబడులు పెట్టిందని.. సీబీఐకి చిత్తశుద్ధి ఉంటే పూర్తి విచారణ చేయాలన్నారు. కౌశిక్ రెడ్డికి రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదన్నారు. పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సొంత గూటికి వ‌స్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన వాళ్లేన‌న్నారు.


బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతం అంటున్నారు.. బీజేపీ వాళ్లకు సొంత నాయకులు లేరన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కుంటు రాష్ట్రాలలో అధికారంలోకి వ‌చ్చారు.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ వాళ్ల‌కు నాయకులు దొరకట్లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమి చేయలేరన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమ‌న్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ 250 సీట్లు గెలుస్తుంది.. తెలంగాణలో 14సీట్లు గెలుస్తుంద‌ని జోస్యం చెప్పారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని అన్నారు.

Next Story