మరోసారి బయటపడ్డ విబేధాలు.. ఉత్తమ్ ముందే కొట్లాట..!

Congress Leader Fight. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొంగ్రెస్ పార్టీ పరిస్థి మరీ దారుణంగా

By Medi Samrat  Published on  25 Feb 2021 2:18 PM GMT
మరోసారి బయటపడ్డ విబేధాలు.. ఉత్తమ్ ముందే కొట్లాట..!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొంగ్రెస్ పార్టీ పరిస్థి మరీ దారుణంగా తయారైంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపిలో కాంగ్రెస్ పార్టీ మాటే వినిపించడం లేదు. ఇక తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ కి ప్రతిపక్షంగా నిలబడుతుంది. ఈ మద్య బీజేపీ ఫామ్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పై మరింత నిరుత్సాహం కలుగుతుంది జనాలకు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

మహబూబాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముందే కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. వేదికపై ఒక వర్గం పేరు చెప్పి మరో వర్గం ప్రస్తావన లేదని గొడవకు దిగారు.

సుమారు 20 నిమిషాల పాటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మహబూబాబాద్, డోర్నకల్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. డోర్నకల్‌కు చెందిన రాంచంద్రు నాయక్, నెహ్రూ నాయక్ వర్గాలు, మహబూబాబాద్‌కు చెందిన మురళీనాయక్, బలరాం నాయక్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరకు ఇరువర్గాలకు ఉత్తమ్‌ సర్దిచెప్పాల్సి వచ్చింది.

భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే పార్టీ వేదికలపైనే మాట్లాడాలని కానీ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయొద్దని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. సొంత పార్టీలోనే ఇలాంటి సంస్కృతి మంచిది కాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో అత్యుత్సాహం పార్టీ ఐక్యతను దెబ్బతీస్తుందని చెప్పారు.




Next Story