కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను కటింగ్‌ చేస్తోంది: కేటీఆర్

ఏడాది కాంగ్రెస్‌ పాలనలో కటింగులు, కటాఫ్‌లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు భరోసా, కరెంట్‌, కేసీఆర్‌ కిట్‌, తులం బంగారం, మహాలక్ష్మీ రూ.2500తో సహా ఇచ్చిన హామీలు అన్నింటినీలోనూ కటింగ్‌ చేస్తుందని దుయ్యబట్టారు.

By అంజి  Published on  20 Jan 2025 11:05 AM IST
Congress government, schemes, KTR, Telangana

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను కటింగ్‌ చేస్తోంది: కేటీఆర్

హైదరాబాద్‌: ఏడాది కాంగ్రెస్‌ పాలనలో కటింగులు, కటాఫ్‌లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు భరోసా, కరెంట్‌, కేసీఆర్‌ కిట్‌, తులం బంగారం, మహాలక్ష్మీ రూ.2500తో సహా ఇచ్చిన హామీలు అన్నింటినీలోనూ కటింగ్‌ చేస్తుందని దుయ్యబట్టారు. 'అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కట్టించి ఎందుకు ఇవ్వరు? డబుల్‌ బెడ్రూంలకు మూడు రంగులు వేసి మురిపిస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌ జాగో తెలంగాణ జాగో' అంటూ కేటీఆర్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఇందిరమ్మ ఇంటికి కటాఫ్‌.. 1994 అంటూ సాక్షి దినపత్రిక రాసిన కథనం పేపర్‌ క్లిప్‌ను షేర్‌ చేశారు.

''సాగునీళ్లు, న్యూట్రిషన్ కిట్, ఫించను రూ.4000 వేలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, జాబ్ క్యాలెండర్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు ₹25 వేల పింఛను, ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు, భూమిలేని రైతులకు సైతం రైతు బీమా, నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం, ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్, రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం, కమీషన్, ఆర్టీసీ విలీన ప్రక్రియ, ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ.12 వేలు, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు.. అన్ని కటింగ్‌లే'' అంటూ కేటీఆర్‌.. సీఎం రేవంత్‌ సర్కార్‌పై ఫైర్‌ అయ్యారు.

Next Story