కాంగ్రెస్ తొలి జాబితా విడుదల‌.. రాహుల్ గాంధీ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తున్నారంటే..

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఇందులో రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ వంటి ప్ర‌ముఖుల‌ పేర్లు ఉన్నాయి

By Medi Samrat  Published on  8 March 2024 8:08 PM IST
కాంగ్రెస్ తొలి జాబితా విడుదల‌.. రాహుల్ గాంధీ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తున్నారంటే..

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఇందులో రాహుల్ గాంధీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ వంటి ప్ర‌ముఖుల‌ పేర్లు ఉన్నాయి. వయనాడ్‌ నుంచి రాహుల్‌ మరోసారి అభ్యర్థిగా బరిలోకి దిగనుండ‌గా.. రాజ్‌నంద్‌గావ్‌ నుంచి బఘేల్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న తామ్రధ్వాజ్ సాహుకు కూడా పార్టీ అవకాశం కల్పించింది. ఆయ‌న మహాసముంద్ నుంచి బ‌రిలో ఉండ‌నున్నారు.



మొత్తం 39 మందితో లోక్ స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితాను కాంగ్రెస్‌ ప్ర‌క‌టించ‌గా.. మొద‌టి లిస్టులో తెలంగాణ నుంచి న‌లుగురు అభ్య‌ర్ధుల‌కు స్థానాలు ఖరారు అయ్యాయి. నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి ల‌కు తొలి జాబితాలోనే సీట్లు ఖ‌రారు అయ్యాయి. తెలంగాణ‌లో మిగ‌తా 13 స్థానాల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించాల్సివుంది.

Next Story