నేడు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా
పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది.
By అంజి Published on 22 Dec 2023 3:05 AM GMTనేడు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా
పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉండనుంది. అలాగే పార్లమెంట్‌లో సెక్యూరిటీ లోపాలపై కూడా ఇండియా కూటమి నిరసన తెలియజేయనుంది.
పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం వ్యవహారిస్తున్న విధానాలను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్లమెంట్‌లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి నిరసన తెలుపుతుందని ఆయన తెలిపారు.
146 మంది ప్రతిపక్ష శ్రేణుల ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, భారత కూటమి నేతలు ఈరోజు (డిసెంబర్ 22) దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. ప్రభుత్వ "అనైతిక, చట్టవిరుద్ధమైన" ప్రవర్తనకు వ్యతిరేకంగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాలలో దేశవ్యాప్త నిరసనలు కూడా నిర్వహించబడతాయని ఇండియా కూటమి తెలిపింది. డిసెంబరు 13న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ గందరగోళం సృష్టించిన 146 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు ఉభయ సభల నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఇది జరిగింది.