కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర కనపడుతున్నది..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించే లోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. హడావిడిగా ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్టే.. గ్రామపంచాయతీల వారీగా కుల గణన వివరాలు వెల్లడించాలి. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తున్నది.. రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తుంది...అని కవిత పేర్కొన్నారు.