కిషన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ఎన్నికల కమీషన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు

By Medi Samrat  Published on  13 May 2024 9:48 AM IST
కిషన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై ఎన్నికల కమీషన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరును ప్రస్తావించారు. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు, పార్టీల పేర్లు వంటివి ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌ను కోరారు. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటును వినియోగించుకున్నారు. సికింద్రా బాద్ లోక్ సభ స్థానం నుంచి మరోసారి బీజేపీ తరుపున కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి టీ. పద్మారావు పోటీలో ఉన్నారు.

Next Story