Video : కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మహిళను చెంపదెబ్బ కొట్టారా.?

కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు.

By Medi Samrat  Published on  4 May 2024 7:26 AM IST
Video : కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మహిళను చెంపదెబ్బ కొట్టారా.?

కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఓ మ‌హిళ‌ను జీవన్ రెడ్డి చెంప దెబ్బ కొట్టిన ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఆర్మూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని ఓ గ్రామంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్ రెడ్డి మరికొందరు నేతలతో కలిసి ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

మే 13న జరగ‌నున్న ఎన్నిక‌ల్లో ‘పువ్వు’ గుర్తుకు ఓటేస్తానని గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న మహిళ చెప్ప‌డంతో ఆమె జీవన్‌రెడ్డి చెంప దెబ్బ కొట్టార‌ని వైర‌ల్ అయిన వీడియో కింద రాసుకొచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశానని.. అయితే పింఛన్‌ రావడం లేదని ఆమె వాపోయిన‌ట్లు తెలుస్తుంది. అయితే వీడియోను ప‌రిశీలిస్తే.. జీవ‌న్ రెడ్డి ఆ మ‌హిళ‌కు స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నంగా తెలుస్తుంది. ప‌క్క‌నున్న వినయ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇత‌ర నేత‌లు కూడా న‌వ్వ‌డం వీడియోలో చూడ‌వ‌చ్చు. అయితే ప‌లువురు వీడియోను షేర్ చేస్తూ.. జీవ‌న్ రెడ్డి మ‌హిళ‌ను చెంప దెబ్బ కొట్టిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆర్మూరు ఒకటి. బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ ధ‌ర్మ‌పురి అరవింద్‌పై కాంగ్రెస్‌ పార్టీ జీవన్‌రెడ్డిని రంగంలోకి దింపింది.

Next Story