హైదరాబాద్: ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు నిరసన జరగనుంది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ రాజకీయ కక్షతో ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడి కేసులు పెట్టి వేధించిన నేపథ్యంలో ఢిల్లీ కోర్టు ఈడి కేసులను తప్పు పట్టిన అంశాలను ప్రజలకు వివరించేందుకు టీపీసీసీ నిరసన ర్యాలీ చేపట్టనుంది.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. అటు ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ తలపెట్టిన దీక్షను ఆదివారానికి వాయిదా వేసినట్లు టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు.