కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ
By Medi Samrat Published on 20 Aug 2024 7:27 PM ISTముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజ్యసభ ఎంపీ ఎం అనిల్ కుమార్ యాదవ్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాడిన పదాలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని ‘ఢిల్లీకి బానిస’గా అభివర్ణించడం ద్వారా కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని.. కేటీఆర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించారు.
Next Story